వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఏక్ నాధ్ తెలిపిన వివరాల మేరకు గుంటూరు పట్టణం కృష్ణనగర్ కు చెందిన ఓ వివాహిత ఈనెల 12న ఇంటిలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వెతికిన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయినట్లు నిర్ధారించుకుని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.