ఒక ఎలుకను పట్టుకోవడానికి రైల్వే శాఖ రూ.41,000 ఖర్చు చేసినట్లు చూపిన గణాంకాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ 2020-22 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.50 లక్షలు ఖర్చు చేసింది. కేవలం 168 ఎలుకలే పట్టినట్లు సమాచారం. చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే రైల్వే శాఖ ఈ వివరాలు అందజేసింది. అలాగే అంబాలా డివిజన్ 2020-23 వరకు రూ.39.3 లక్షలు ఖర్చు చేసింది.