డిపాజటర్ల నుంచి రూ.582 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ ఛైర్మన్ రాయవరపు సీతారామాంజనేయలు, వైస్ ఛైర్మన్ ఆర్‌బీ విశాలాక్ష్మితో పాటూ డైరెక్టర్లకు చెందిన 64ఆస్తులను గుర్తించినట్లు సొసైటీ ఛైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు తెలిపారు. వీటిని న్యాయస్థానం ద్వారా సొసైటీకి స్వాధీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా, పశ్చిమగో దావరి, కృష్ణా, విశాఖ జిల్లాల పరిధిలో సుమారు 2 వేలమంది సభ్యులతో ఈనెల 26న కాకినాడ దంటూ కళాక్షేత్రంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. నూతన పాలకవర్గం బాధ్యతలు తీసుకున్నాక సొసైటీ సభ్యుల సహకారంతో ప్రభుత్వం, సీఐడీ అధికారుల ద్వారా బాధితులకు న్యాయం చేసేలా ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల స్వాధీనంలో పురోగతి సాధిస్తామన్నారు. సుమారు 19 వేల మంది సభ్యులకు రూ.450 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ఆస్తులు పాత సొసైటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లు, డైరెక్టర్లకు చెందిన సుమారు 64 ఆస్తులు గుర్తించామన్నారు. ప్రస్తుతానికి సుమారు 3 కోట్ల మేర రికవరీ చేశామని, డిసెంబర్ నెలాఖరు నాటికి సుమారు రూ. 100 కోట్లు రికవరీ చేస్తామన్నారు.