ఇవాళ(సెప్టెంబర్ 17) ప్రధాని మోదీ పుట్టినరోజు నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలుసుకుందాం.. మోదీకి హోటల్స్‌లో బస చేయడం అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయనెప్పుడూ హోటల్స్‌లో దిగడానికి ఆసక్తికనబరిచేవారు కాదు. దాదాపుగా.. ప్రయాణాలతో ఆ సమయాన్ని భర్తీ చేసుకునేవారు ఆయన. ఒకవేళ ఆ మరుసటిరోజు ఉదయం మీటింగ్‌లు ఉండే అత్యవసర స్థితిలో మాత్రమే ఆయన హోటల్స్‌లో దిగేవారట.