ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైలును 2024 మార్చిలోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు వందే మెట్రో రైలు సైతం వచ్చే ఏడాదే రానున్నట్లు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తొలి వందేభారత్ స్లీపర్కోచ్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.