అర్హులందరికీ నివేశన స్థలాలు ఇచ్చి వాటికి పట్టాలు ఇస్తామని బాపట్ల ఎమ్మెల్యే కొన రఘుపతి అన్నారు. శనివారం బాపట్ల తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 28 మందికి కొత్తగా మంజూరైన ఇళ్ల స్థలాల పట్టాలని పంపిణీ చేశారు. అర్హులైన వారిని గుర్తించి పట్టాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జి. రవీంద్ర, తహసిల్దార్ సుధారాణి పాల్గొన్నారు.