కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్విట్ చేశారు. ఇదిలావుంటే రేపటి పార్లమెంట్ సమావేశాలు కొత్తగా నిర్మించిన భవనంలో జరగనున్నాయి. దాదాపు శతాబ్ధ కాలం క్రితం నిర్మించిన పాత పార్లమెంట్ భవనంలో ఇప్పటి వరకు ఎన్నో చర్చలు, నిర్ణయాలు జరిగాయి. స్వాతంత్రానికి పూర్వం ఇరవై ఏళ్ళు, స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు పాత భవనం సాక్షిగా చారిత్రక సమావేశాలు జరిగాయి. ఈ భవనంలో ఈ రోజు జరిగిన సమావేశమే చివరిది. రేపు కొత్త భవనంలోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ, ఇక్కడి జ్ఞాపకాలన్నింటినీ కాసేపు నెమరువేసుకున్నామని, తదుపరి అధ్యాయం కోసం (కొత్త పార్లమెంట్ భవనం) వేచి చూస్తున్నామని పేర్కొంటూ ట్వీట్ చేశారు.