ఆదిత్య ఎల్ 1 మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. భూమి చుట్టూ ఆదిత్య ఎల్ 1 తిరిగే దశ ముగిసినట్లు పేర్కొంది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 వైపు ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఇది దాదాపు 110 రోజుల తర్వాత L1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి చేరుతుందని ఇస్రో వివరించింది. ఇక L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.