స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్లో చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశం ఉంది.