ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ప్రజలపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో కొందరు యువకులు, చిన్నారులు సెల్ ఫోన్ వినియోగించారని తాలిబాన్లు క్రూరంగా వ్యవహరించారు. చిన్నారులను కొరడాతో దారుణంగా కొట్టారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంతో సంబంధం ఉన్న ముష్కరులు తమ గోప్యతను ఉల్లంఘిస్తున్నారని ఆఫ్ఘన్ ప్రజలు వాపోతున్నారు.