వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నత పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని పయ్యావుల కేశవ్ మంగళవారం ఆరోపించారు. కుట్రపూరితంగానే శరత్ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని అక్రమ కేసులు పెట్టారన్నారు. తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసినందుకు గాను వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారులను విచారించకుండా చంద్రబాబుపై మాత్రమే ఎలా ఆరోపణలు చేస్తారని నిలదీశారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి 42 కేంద్రాలకు ఇందుకు సంబంధించి సామాగ్రిని సరఫరా చేసామని, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 స్కిల్ కేంద్రాల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ చూపిస్తూ వీడియోలు చూపిస్తామని, ఏ ఎక్విప్మెంట్ అడిగితే అది సెంటర్లలో కనిపిస్తుందన్నారు. సీమెన్స్ కంపెనీ అద్భుత పనితీరును కనబరిచిందని నివేదికలు వచ్చాయన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో ప్రతి విషయాన్ని ఐఏఎస్ అధికారులతో కూడిన హైపర్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. అందులోను ఎలాంటి అవినీతి లేదన్నారు.