చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా బ్రాహ్మణి మాటలు నవ్వుకునేలా ఉన్నాయని ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి కొట్టిపారేశారు. బ్రాహ్మణి మాటలు వింటుంటే న్యాయమూర్తి మీద కూడా కేసు పెట్టాలేమో అని వ్యాఖ్యానించారు. నారా బ్రాహ్మణి తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పోసాని స్పష్టం చేశారు. మీ తాతయ్యను ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టింది ఎవరు? మీ తాతయ్యను చంపంది ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోసాని... చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల కోసమే జైలుకు వెళ్లానని చెబుతున్న చంద్రబాబు... ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిందీ, 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నది కూడా ప్రజల కోసమేనా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడినవాళ్లనే జైలుకు పంపుతారని పోసాని వ్యాఖ్యానించారు.