హీరో రాజా తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆనంద్, ఆ నలుగురు సినిమాలతో అలరించిన నటుడు రాజా తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినిమాలకు దూరమైన రాజా... వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. మణిపూర్ అంశంపై చాలామంది మాట్లాడలేకపోయారన్నారు. మీడియా, ఇతర పార్టీలు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోలేదని, కాంగ్రెస్ మాత్రం ధీటుగా స్పందించిందన్నారు.