విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేటకు చెందిన రైతు ఉదయాన్నే పొలం వెళ్లాడు. అక్కడ పనులు చేసుకోవడంలో నిమగ్నం అయ్యాడు. మరోవైపు మడ్డువలస రిజర్వాయర్ నుండి పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఇంతలో అతడికి వింతి అనుభవం ఎదురైంది.. ఓ పొడవాటి అరుదైన ప్రాణి వేగంగా పాకుతూ రైతు వైపుగా వచ్చింది. ఆ ప్రాణిని చూసిన రైతుకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ వింత ప్రాణిని చూసి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ జీవి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు.. కానీ భయం వెంటాడింది.
వెంటనే ఆ చుట్టు పక్కల పొలాల్లో ఉన్న రైతుల్ని పిలిచాడు. అందరు కలిసి ఆ ప్రాణి దగ్గరకు వెళ్లారు. చూసేందుకు పొడవుగా, లావుగా ఉంది.. చూడటానికి పాములాగే చేప ఆకారంలో ఉంది. వెంటనే ఆ ప్రాణినిని కర్రలతో కొట్టారు.. దీంతో అది అక్కడి నుంచి కదల్లేకిపోయింది. ఆ తర్వాత గమనించగా.. అది పాము కాదు చేపగా గుర్తించారు.. ఇది చాలా అరుదైన చేపగా తేల్చారు. దాదాపు ఐదు అడుగుల పొడవు, 20 కేజీలకుపైగా బరువు ఉంది. అయితే ఆ చేప విషయంలో రైతుల మధ్య గొడవ జరిగింది. ఆ చేపలో వాటా కావాలంటూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత గ్రామంలోని పెద్దలు పంచాయితీ చేసి ఆ చేపను రైతుకే అప్పగించినట్లు తెలుస్తోంది.