సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలని భారీ విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఖాళీ ప్లేట్లతో నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగం సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు.