నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఆకర్షణగా నిలిచారు. టీడీఎల్పీ సభ్యులతో పాటు ఆమె ప్లకార్డులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. షెల్ కంపెనీల సృష్టికర్త జగన్ రెడ్డి అంటూ ప్లకార్డు ధరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలపై గళం ఎత్తడమే లక్ష్యం అన్నారు.