తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల వివరాల మేరకు. మందడానికి చెందిన బొగ్గవరపు తనీష్ (20), ప్రత్తిపాటి జ్యోతిరాజు (19) విజయవాడలోని వేర్వేరు కాలేజీల్లో చదువుతున్నారు. తనీష్ ఇంట్లో మందలించారని ఉరేసుకోగా, జ్యోతిరాజ్ ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. ఘటనలపై పోలీసులకు సమాచారం అందలేదని తెలుస్తోంది.