ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌన్సిలింగ్‌ లో లోపాలని సరిచేయండంటూ సీఎంకి లేఖ వ్రాసిన రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 12:53 PM

వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ  చేపట్టిన ఎంబిబిఎస్ కౌన్సిలింగ్‌ లో లోపాలు వెలుగు చూశాయని, రిజర్వేషన్ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని, వాటిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అని సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఓపెన్ క్యాటగిరి సీట్లను మొదట ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తుంగలో తొక్కిందని విమర్శించారు. తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ క్యాటగిరీలో, ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఎంబిబిఎస్ కౌన్సిలింగ్ రద్దు చేసి, తిరిగి కౌన్సిలింగ్ జరిపి, రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం చేయాలని రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com