ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా,ప్రతి మండలంలో రిలే నిరాహా ర దీక్షలు చేస్తున్నామని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రహదారులను దిగ్బంధ చేస్తామన్నారు. అన్ని అనుబంధ సంఘాలతో కలిసి ఈ ఉద్యమం చేస్తామన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలపాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 22న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.