వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఉత్తరాంధ్ర బైక్ యాత్ర గురువారం విజయనగరం జిల్లాకు చేరుకుంది. వైజాగ్ లో బుధవారం ప్రారంభమైన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల యాత్ర వివిధ ప్రాంతాల గుండా విజయనగరానికి చేరుకుంది. అక్కడ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు లోక్ నాథం మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.