విజయనగరం జిల్లా, కురుపాం: కొమరాడ మండలం దుగ్గి ముంపు ప్రాంతంలో 8 ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు పంట పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఎవరు ఏనుగుల వద్దకి వెళ్లవద్దని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఒంటరి ఏనుగుతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.