చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం మొదలు కావడంతో ఇస్రో చర్యలు మొదలుపెట్టింది. ల్యాండర్, రోవర్ లను యాక్టివేట్ చేయడానికి యత్నిస్తోంది. -200 డిగ్రీల సెల్సియస్ వద్ద 16 రోజులు స్లీప్ మోడ్ లో ఉన్న అనంతరం రోవర్, ల్యాండర్ తిరిగి పని చేసేలా చూస్తోంది. బ్యాటరీలు మళ్లీ రీచార్జ్ అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే మళ్లీ 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలకు అవకాశం ఉంటుంది.