స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ రిమాండు శుక్రవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాల కోసం ఆయనను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఇవాళ హాజరు పరచనున్నారు. మరోవైపు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజే తీర్పు వెలువడనుంది.