చెన్నైకు చెందిన ఓ కారు డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పళని నెయ్ క్కారపట్టికి చెందిన రాజ్ కుమార్ కు ఈ నెల 9న మర్కంటైల్ బ్యాంక్ నుంచి నగదు జమైనట్లు మెసేజ్ వచ్చింది. ఈ క్రమంలో తన స్నేహితునికి రూ.21 వేలు పంపాడు. అయితే, తూత్తుకుడి ప్రధాన బ్యాంకులో పొరపాటు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ డబ్బు వెనక్కు తీసుకున్నారు. స్నేహితునికి పంపిన డబ్బు సైతం చెల్లించాలని సూచించారు.