కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. దండేలి ప్రాంతం ఒకే పాఠశాలకు చెందిన 14 మంది బాలికలు మణికట్టు కోసుకున్నారు. వీరంతా 9, 10 తరగతి విద్యార్థులేనని తేలింది. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికలు ఎందుకు ఇలా ప్రవర్తించారనేది అంతు చిక్కడం లేదని పోలీసులు, అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మానసిక వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.