భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో విశేష కృషికి గుర్తింపుగా ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ ఏడాది అవార్డు ప్రకటించింది. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా ఉన్నారు. వరి సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు ఆమెకు ఈ అవార్డు దక్కింది.