ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని ఓ 27 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి రూరల్ కాలూరులో జరిగింది. నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. అనంతరం అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ విక్రయించిన దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa