ఒడిశాలోని సంబల్ పుర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రైరాఖోల్ కు చెందిన బీరెన్ కనరా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం అతను తిరిగి బతికొస్తాడని 20 గంటలకు పైగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.