రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రెయిన్ శుక్రవారం ఏకంగా సెవెస్తపోల్ లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణి ప్రయోగించింది. ఉక్రెయిన్ పై నౌకాదళ దాడులను రష్యా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తోంది. ఓ క్షిపణి నేరుగా తాకడంతో ఈ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుందని క్రిమియా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa