ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ 80% రాయితీతో నెలాఖరు వరకు కొనసాగించనున్నట్లు వ్యవసాయ అధికారులు శనివారం తెలిపారు. అక్టోబర్ నుంచి రబీ విత్తన ప్రణాళిక అమలులోకి వస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్లో ప్రధాన పంటలు సాగు చేయని రైతులు ప్రత్యామ్నాయ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 80% రాయితీ పోనూ ఉలవలు కిలో రూ. 21. 60, అలసందలు కిలో రూ. 23, పెసలు కిలో రూ. 23. 50కి పంపిణీ జరుగుతోందని తెలిపారు.