కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ శనివారం వాదిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ దానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కుల గణన లేకుండా ఓబీసీలకు తగిన భాగస్వామ్యం కల్పించడం సాధ్యం కాదన్నారు. ప్రధాని 24 గంటలూ ఓబీసీల గురించి, వారిని గౌరవించడం గురించి మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు కుల గణనకు ఎందుకు భయపడుతున్నారన్నారు. దేశంలో ఎంత మంది మహిళలు, ఓబీసీ, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారో తెలుసుకోవచ్చు అని అన్నారు.