వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ప్రధాని శనివారం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తుండగా, ఓ యువకుడు భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలకు వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానికి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.