నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్ లో శనివారం జరిగిన పేలుడులో 34 మంది మృతి చెందారు. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలో నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిన మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శిశువులున్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa