ప్రొద్దుటూరు స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం జీపీఎస్ కు వ్యతిరేకంగా ఏపీఎస్టీఎఫ్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఏపీఎస్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సి. శ్రీనివాసులు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ సీపీఎస్ జిల్లా కన్వీనర్ నరేష్, పట్టణాధ్యక్షుడు హరిరామకృష్ణ, జోసెఫ్, జాకీర్, తదితరులు పాల్గొన్నారు.