కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమ పిల్లల భద్రతపై ఆవేదన చెందుతున్నారు జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని కలత పడుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థుల కోసం ఏదైనా హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలని విదేశాంగ మంత్రిని పంజాబ్ బీజేపీ చీఫ్ కోరగా, ఇండియన్ కాన్సులేట్ ను సంప్రదించి ఏదైనా సహాయం పొందొచ్చని స్పష్టం చేశారు.