మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో మహిళ సాధికారతపై చర్చించడంతోపాటు అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై చర్చలు జరపనున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం చేయనున్నారు. మరోవైపు ఉదయం 10 గంటలకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు.