ఏపీలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. "రుణమాఫీపై చంద్రబాబు మోసం చేశారు. గత నాలుగేళ్లుగా సీఎం జగన్ రైతుభరోసా కింద రూ.31వేల కోట్లు అందించారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్. ఇచ్చిన హామీల్లో 10శాతం కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు." అని వ్యాఖ్యానించారు.