చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. క్వాష్ పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్ట్‌లో చేరుస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. పిటిషన్‌ను ఎప్పుడు విచారించాలనే విషయంపై రేపు(మంగళవారం) నిర్ణయం తీసుకోనున్నారు.