సీఎం జగన్పై ఉన్న కేసులు, పిటీషన్లు, స్టేలపై టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు సోమవారం అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సీఎం జగన్ ఆర్ధిక ఉగ్రవాదని, ధనపిశాచి అని వ్యాఖ్యానించారు. 2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం, తండ్రి వైఎస్ అధికారంలోకి రాగానే రూ.3.30 లక్షల కోట్లకు అమాంతం ఎలా ఎగబాకారని ప్రశ్నించారు. ప్రజా సంపద లూటీతోనే. జగన్ ఆస్తులు పెరిగాయన్నారు.