స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ రేపు(మంగళవారం) ప్రస్తావనకు రానున్నట్టు తెలిపింది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతిచ్చింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు కేసును సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. అయితే రేపు మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు.చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని లూథ్రా వాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యవహారం అని... అక్కడ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని సిద్దార్థ లూథ్రా చెప్పారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని లూథ్రా చెప్పారు. దీంతో రేపు (మంగళవారం) మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సిఐడి తరపున వాదించిన రంజిత్ కుమార్‌లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.