నేడు అంగన్వాడీల డిమాండ్స్ పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైరటించి నిరసనకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అంగన్వాడీల న్యాయమైన కోరికలను ఉక్కుపాదంతో అణచివేయడం దారుణమన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొంటే ఉద్యోగాలు ఊడగొడతామని చెపుతున్న జగన్ ఉద్యోగాన్ని ఊడకొడతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ అరెస్టులకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
![]() |
![]() |