కళియుగ దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం భక్త జనసందోహం నడుమ శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. కాగా, ఇవాళ రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు.