కావేరి నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయొద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం బెంగళూరు బంద్‌కు పలు సంఘాలు పిలుపు ఇచ్చాయి. దీంతో నగరంలో ఇప్పటికే విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ఇచ్చాయి. ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా బంద్‌కు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరు 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.