గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులకు మెరుగైన వైద్యంతో పాటు సౌకర్యాలు కల్పించాలని సిపిఎం, సిపిఐ, బిఎస్పి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆసుపత్రి ఆవరణలో నాయకులు, కార్యకర్తలు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శిలు రామకృష్ణ, రామదాసు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన సౌకర్యాలు, వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.