టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజు మంగళవారం ఉదయాన్నే పోలీసులు భగ్నం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీక్ష భగ్నం చెయ్యడాన్ని పరిటాల సునీత, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.