అల్లూరి జిల్లాలో సెప్టెంబర్ 10న నమోదైన అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. మృతుడు తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన పగిల్ల దుర్గా ప్రసాద్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. ప్రసాద్ తరచూ మద్యం సేవించి ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ప్రసాద్‌ను అతని తల్లిదండ్రులే మరో ఇద్దరు వ్యక్తులకు రూ.3 లక్షల సుపారి ఇచ్చి, వారితో కలిసి పీక కోసి హత్య చేసినట్లు వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa