ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ ముస్తాబవుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. ఈ ఏడాది నాలుగో ఉత్సవాలను వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. క్యాపిటల్ భవనం ముందు విశాల ప్రాంగణంలో దాదాపు ఒక ఫుట్ బాల్ మైదానం అంత విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 17,000 మంది కళాకారులు, దేశాధి నేతలు, నాయకులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. సుమారు 50 లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 50కిపైగా ప్రదర్శనలు ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 1000 మంది చైనా సంగీత, నృత్య కళాకారుల బృందంతో సంప్రదాయ కళా ప్రదర్శన, భారత్ నుంచి 1000 మందికి పైగా కళాకారులతో గార్భా నృత్య ప్రదర్శన, 700 మంది భారతీయ కళాకారులతో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు.. హిప్-హాప్ నాట్యం ఆరంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్టిస్ బ్లో, షా-రాక్, సీక్వెన్స్ గర్ల్స్, డీజే కూల్ మొదలైన ప్రముఖుల బృందంతో ప్రదర్శన ఉంటుంది. అందులో భాగంగా కింగ్ చార్లెస్, కెల్లీ ఫోర్మన్ నిర్వహణలో మొట్టమొదటిసారిగా 100 మంది కళాకారులచే బ్రేక్ డాన్స్ ప్రదర్శన ఉంటుంది.
ఉక్రెయిన్‌కు చెంది 100 మంది కళాకారులచే సంప్రదాయ నృత్య ప్రదర్శన, గ్రామీ అవార్డు గ్రహీత మిక్కి ప్రీ ఆధ్వర్యంలో 1000 మంది చే గిటార్ వాద్య సంగీత ప్రదర్శన, విఖ్యాత సంగీత కళాకారుడు బాబ్ మర్లీకి చెందిన ‘వన్ లవ్’ ఆల్బమ్‌ను అతడి మనుమడు స్కిప్ మర్లీ పునః ప్రదర్శన చేస్తారు. అమెరికాకు గాంధీ మార్టిన్ లూధర్ కింగ్ తన ప్రఖ్యాత ఉపన్యాసం ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ ను నేషనల్ మాల్ వేదికపై నుంచి. 1963లో ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పారు. దానికి ఒక శతాబ్ది కిందట చికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజను సమ్మోహితులను చేసి ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన సోదరసోదరీమణులగా సంబోధించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టి వివేకానందుడు.. మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం వదలిపెట్టాలనిహితవు పలికారు.
ఈ సెప్టెంబర్ 29న ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సవంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలు, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను ‘ఒకే ప్రపంచ కుటుంబం’ గా వేదికపై ఆవిష్కరించబోతున్నారు. మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో కీలమైన ఆహారం అనేది ఇక్కడ కూడా తన ప్రధాన పాత్రను పోషించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వంటకాలను హాజరయ్యే ప్రేక్షకులకు వడ్డించనున్నారు. అలాగే, ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించబోతుండటం విశేషం. ఈ ఉత్సవాలకు ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, భారతీయ అమెరికన్ వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సురినామ్ రక్షణ మంత్రి క్రిష్ణకొమారి మాథెరా మొదలైనవారు హాజరవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa