ఆస్తి కొనుగోలులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ అయింది.బటిండాలోని కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వారెంట్ జారీ చేశారు. భటిండాలో ప్లాట్ల కొనుగోలు అక్రమాలకు సంబంధించి బాదల్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ను వీడిన బాదల్ జనవరిలో బీజేపీలో చేరారు.బాదల్ తరపు న్యాయవాది సుఖ్‌దీప్ సింగ్ ప్రకారం, అరెస్టుకు ముందు తాజా బెయిల్ దరఖాస్తు కోర్టులో దాఖలు చేయబడుతుంది. బాదల్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదన్నారు.బాదల్ నివాసంలో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో బృందాలు సోదాలు నిర్వహించడంతో సోమవారం మాజీ మంత్రిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.