స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనపై నమోదైన సీఐడీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కాం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంని ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.