ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలసి 160 సీట్లు సాధిస్తాయని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ పేర్కొన్నారు. రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణిలను అశ్వనీదత్ కలసి మద్దతు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ.. 'చంద్రబాబును జైలులో పెడతారని ఎవరూ ఊహించలేదు. కానీ జగన్ ఆ పని చేశారు. వచ్చే ఎన్నికల్లో 'చంద్రసేన' 160 సీట్లు సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది' అని వ్యాఖ్యానించారు.